ఖైరతాబాద్, జూన్ 5: ఖైరతాబాద్‌లోని వాసవీ సేవా కేంద్రం స్వర్ణోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఓఎస్డీ వేములు శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు ఉచితంగా కుట్టుమిషన్లు, బియ్యం పంపిణీ చేశారు. అంతకుముందు వర్టెక్స్ హోమ్స్ ప్రైవేటు లిమిటెడ్ జాయింట్ ఎండీ గురుమురళీ మోహన్, వాసవీగ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ ఎర్రం విజయ్‌కుమార్, మంజీరా గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గజ్జల యోగానంద్, సాయి రాఘవేంద్ర కన్క్ట్రషన్స్ మేనేజింగ్ పార్టనర్ జనార్దన్, ప్రణవ్ బిల్డర్స్ సీఎండీ రవికుమార్ గౌరవెంచర్స్ ఎండీ ఆదిత్యను సేవా కేంద్రం తరపున ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సేవా కేంద్రం అధ్యక్షుడు అలంపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, స్వర్ణోత్సవ కమిటీ కన్వీనర్ మల్లికార్జున్, చైర్మన్ కృష్ణయ్య, సేవా కేంద్రం కోశాధికారి జ్ఞాన్‌చందర్ పాల్గొన్నారు.