మల్కాజిగిరి జోన్ బృందం, జూన్ 5 : పట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలని వివిధ డివిజన్ల కార్పొరేటర్లు అన్నారు. ఆదివారం వెంకటాపురం డివిజన్లో కార్పొరేటర్ సబితాకిశోర్ మొక్కలు నాటారు. అల్వాల్ డివిజన్ పట్టన ప్రగతిలో పాల్గొన్న కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్‌రెడ్డి రోడ్లను పరిశీలించి సమస్యలు తెలుసుకున్నారు. వెంకటాపురంలో డిప్యూటీ కమిషనర్ నాగమణి మొక్కలు పంపిణీ చేశారు. నేరేడ్మెట్ డివిజన్లో కార్పొరేటర్ మీనాఉపేందర్‌రెడ్డి రోడ్లను పరిశీలించి స్థానికంగా ఉన్న సమస్యల గురించి ఆరా తీశారు. అదే విధంగా మల్కాజిగిరి డివిజన్లో మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిని విజయవంతం చేయడానికి అందరూ కృషిచేయాలని అన్నారు.
ప్రతి వార్డులో జరిగే కార్యక్రమాన్ని నోడల్ అధికారులు పరిశీలిస్తున్నారని అన్నారు. నాలాల పూడికతీత, ప్రమాదాలు జరుగకుండా చర్యలు, మ్యాన్ హోళ్ల పరిస్థితిని పరిశీలించి శిథిలావస్థకు చేరిన వాటిని తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేస్తున్నామని వారు తెలిపారు. హార్టికల్చర్ అధికారులతో కలసి మొక్కలు నాటుతున్నామని చెప్పారు. డీసీలు రాజు, నాగమణి, ఈఈలు లక్ష్మ ణ్, రాజు, డీఈ మహేశ్, ఏఈలు శ్రీకాంత్, అరుణ్, వాటర్ వర్క్స్ జీఎం శ్రవంతి, మేనేజర్లు సతీశ్, మల్లికార్జున్, శ్రీవాణిరెడ్డి, కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్‌రెడ్డి, మీనా ఉపేందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, నాయకులు అనిల్‌కిశోర్, ఉపేందర్‌రెడ్డి, రావుల అంజ య్య, ఎస్.ఆర్. ప్రసాద్, పుదారి రాజేశ్కన్న, భాస్కర్, ఈ జనార్దన్, మోసిన్, ప్రభాకర్, సత్యనారాయణ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.