కాచిగూడ,జూన్ 4: పట్టణ ప్రగతితో నగర రూపు రేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా శనివారం కాచిగూడ డివిజన్లోని వీరన్నగుట్ట, బర్కత్‌పుర తదితర బస్తీ కాలనీల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కాచిగూడ కార్పొరేటర్ ఉమాదేవి పాల్గొని రోడ్లపై ఉన్న చెత్తాచెదారం, మట్టి కుప్పలను తొలగింపజేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. బస్తీ, కాలనీల్లో శుభ్రత, పారిశుధ్యం, భవన నిర్మాణాల వ్యర్థాలు తొలగింపుతో పాటు హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కన్నె రమేశ్‌యాదవ్, డీఎంసీ వేణుగోపాల్,ఏఎంఓహెచ్ జ్యోతిబాయి,డీఈ సువర్ణ, జలమండలి ఏఈ భావన, సుభాశ్పటేల్, అశోక్కులకర్ణి, బల్వీర్, రాము, భీంరాజ్, వాసు, సంతోష్,రవియాదవ్,నాగు.చందు తదితరులు పాల్గొన్నారు.
బాగ్‌అంబర్‌పేట డివిజన్లో..
నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో రెండో రోజు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని ఎరుకలబస్తీ, తురాబ్‌నగర్, వడ్డెర బస్తీలలో కార్పొరేటర్ పద్మావెంకటరెడ్డి అధికారులతో కలిసి పట్టణ ప్రగతి నిర్వహించారు. బస్తీల్లో పేరుకుపోయిన మట్టి కుప్పల తొలగింపు, పాడైపోయిన డ్రైనేజీ మ్యాన్‌హోళ్లకు మరమ్మతులు, వీధి దీపాల సమస్య, చెట్లకొమ్మల తొలగింపు, రోడ్లకు ప్యాచ్‌వర్క్ పనులు, పారిశుధ్య నిర్వహణ సమస్య, లోతట్టు ప్రాంతాల్లో నిలుస్తున్న వర్షపు నీటి సమస్య, విద్యుత్ స్తంభాల తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పరిసరాల శుభ్రత పాటించాలి..
వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సూచించారు. శనివారం అంబర్‌పేట డివిజన్ ప్రేమ్‌నగర్‌లోని పలు బస్తీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమానికి కార్పొరేటర్ విజయ్‌కుమార్‌తో పాటు పలు శాఖల అధికార యంత్రాంగంతో కలసి హాజరై అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎంసీ వేణుగోపాల్, నోడల్ అధికారి హరిశంకర్, ఏఎంహెచ్‌వో జ్యోతితో పాటు డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు లవంగు ఆంజనేయులు, రామారావు, లింగారావు, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
గోల్నాక డివిజన్లో…
చెత్త రహిత స్వచ్ఛ గోల్నాక డివిజన్ రూపొందిచడమే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి సారించామని కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శనివారం గోల్నాక డివిజన్లోని మారుతీనగర్, గోవింద్‌నగర్, లాల్బాగ్, వడ్డెర బస్తీ తదితర ప్రాంతాల్లో రెండో రోజు నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పలు శాఖల అధికారులతో కలసి అవగాహన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, జలమండలి ఏఈ రోహిత్, వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్, వీధి దీపాల విభాగం అధికారులు విజయేందర్‌తో పాటు టీఆర్ఎస్ నాయకులు రాజు, అరవింద్, రమేశ్, ఉ మేశ్, అనిత, రేణుక, స్వరూప, కమలమ్మ త దితరులు పాల్గొన్నారు.