అబిడ్స్, జూన్ 4 : ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ అన్నారు. శనివారం ఆగాపురా ప్రాంతంలో కార్పొరేటర్ లాల్‌సింగ్‌తో కలిసి డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు పాటు పడుతున్నట్లు తెలిపారు.
గోషామహల్ కార్పొరేటర్ లాల్‌సింగ్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయమన్నారు. ప్రజలకు ఏ విధమైన సమస్య ఉన్నా తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సుధాకర్ గౌడ్, కృష్ణ, నర్సింగ్‌రావు, కిషన్, సందీప్‌రాజ్ పాల్గొన్నారు.
మెహిదీపట్నం, జూన్ 4 : ప్రజల ప్రగతికి పట్టణ ప్రగతి కార్యక్రమం దోహదం చేస్తుందని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ అన్నారు. శనివారం నానల్‌నగర్ డివిజన్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి, పారిశుధ్య పనులను ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్, కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ మాట్లాడుతూ.. పట్టణ ప్రగతితో బస్తీలు, కాలనీల్లో అభివృద్ధి పనులను చేపడతామని పేర్కొన్నారు.
నాంపల్లి నియోజకవర్గంలో..
నాంపల్లి నియోజకవర్గంలో పట్టణ ప్రగతి రెండోరోజు శనివారం ఆసిఫ్‌నగర్, అహ్మద్‌నగర్, రెడ్‌హిల్స్ డివిజన్లలో పలు కార్యక్రమాలను చేపట్టారు. అహ్మద్‌నగర్ డివిజన్ సయ్యద్‌నగర్ నాలాల్లో పూడికతీత పనులను ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్, డీసీ ఇన్కెషాఫ్ అలీతో కలిసి పరిశీలించారు. ఆసిఫ్‌నగర్ డివిజన్లో డీసీ ఇన్కెషాఫ్ అలీ మొక్కను నాటారు. రెడ్‌హిల్స్ డివిజన్లో పారిశుధ్య పనులను జీహెచ్ఎంసీ సిబ్బంది చేపట్టారు.