సిటీబ్యూరో, జూన్ 4(నమస్తే తెలంగాణ): వంద మంది పరీక్షలు రాస్తే..అందులో 15 మందికి వందకు జీరో…మరో 15 మందికి 5 కంటే తక్కువ.. మరో 20 మందికి 7 కంటే తక్కువ…మరో 50 మందికి 8 మార్కులు వచ్చాయి. ఈ లెక్కలు చూసిన ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇవేం పరీక్షలు..ఇవేం మార్కులు అనుకుంటున్నారా..? సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో యాక్సిడెంట్ అక్యూజ్డ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో లెర్నింగ్ లైసెన్స్, ఆ తర్వాత శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు నేర్చుకోవాల్సిన రోడ్డు భద్రతా పాఠాలు, ట్రాఫిక్ నిబ ంధనలపై ఏ మేరకు అవగాహన ఉందో తెలుసుకునేందుకు 40 ప్రశ్నలతో పరీక్ష పెడితే.. చాలా మందికి సు న్నా మార్కులే రావడం కలవరపెట్టింది. నిబంధన లు తెలియకపోయినా.. వంద వేగంతో వాహనాలు నడిపి.. ప్రమాదానికి కారకులవుతున్నారనేది స్పష్టమైంది.
469 మంది…
రోడ్డు ప్రమాదాలకు కారకులైన వారు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారు ఈ కౌన్సెలింగ్కు తప్పక హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా కౌన్సెలింగ్కు వచ్చిన వారికి పరీక్ష పెడుతున్నారు. వాహనదారుడు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా, సురక్షిత ప్రయా ణం సాగించాలంటే పాటించాల్సిన జాగ్రత్తలు, నిబంధనల గురించి సాధారణ ప్రశ్నలే అడుగుతున్నారు. ఈ ఏ డాది వివిధ రోడ్డు ప్రమాదాలకు కారకులైన సుమారు 469 మంది హాజరవ్వగా, అత్యధిక మందికి జీరో మా ర్కులే వచ్చాయి. మిగతా వారికి 4, 5, 8 మార్కులు మాత్రమే రాగా, అతి స్వల్పంగా 10 మందికి పైగా 50 మార్కులు దాటాయి. ఈ మార్కుల ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు వారికి రోడ్లపై పాటించాల్సిన నిబంధనలు, సురక్షిత ప్రయాణం కోసం ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు, జీబ్రా క్రాసింగ్లు, రోడ్డు మార్కింగ్స్ పై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.
కాలేజీలు..ఐటీ కంపెనీల్లో..
ఈ కౌన్సెలింగ్ పరీక్షలే కాకుండా.. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అధికారులు నేరుగా ఇంజినీరింగ్ కళాశాలలు, కాలేజీలు, ఐటీ కంపెనీలకు వెళ్లి.. సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పిస్తున్నారు. ద్విచక్రవాహనాలు, కార్లు ఎలా నడపాలి..? రోడ్డు మార్కింగ్స్ను ఎలా అర్థం చేసుకోవాలి, మలుపులు ఎలా తీసుకోవాలి వంటి అంశాలను వివరిస్తున్నారు. ఇలా ఈ ఏడాది దాదాపు 1050 మందికి అవగాహన కల్పించారు. వీరే కాకుండా క్యాబ్, ఆటో, టిప్పర్లు, లారీలు, భారీ వాహనాలు, ప్రొక్లెయినర్లు, జేసీబీలను నడిపే వారికి కూడా ట్రాఫిక్ రూల్స్ గురించి చెబుతున్నారు.