బేగంపేట జూన్ 4: రెడ్డి సింహగర్జన సభలో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై జరిగిన దాడిని రెడ్డి జేఏసీ ఖండించింది. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు ఇతర డిమాండ్లపై శనివారం సికింద్రాబాద్‌లోని పార్కులైన్ హోటల్లో జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు రాంరెడ్డి, జైపాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. సభలో మంత్రి మల్లారెడ్డి పార్టీ కార్యక్రమాల గురించే మాట్లాడుతుండటంతో కొందరు ఆవేశంలో దాడిచేసి ఉంటారని పేర్కొన్నారు. ఈ సంఘటనలో రెడ్డి సోదరులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకొని రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటులో జాప్యం చేయరాదని ప్రభుత్వాన్ని కోరారు. సభకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానించామని, జేఏసీకి ఏ పార్టీతో సంబంధం లేదని తెలిపారు. సమావేశంలో డీకే వసంతరెడ్డి, మధుసుదన్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.