సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రగతి అట్టహాసంగా కొనసాగుతున్నది. రెండోరోజైన శనివారం ప్రజాప్రతినిధులు, అధికారుల, నగరవాసులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, అధికారులు, కమిటీ మెంబర్లు కలిసి కాలనీలోని సమస్యలకు పరిష్కారం చూపారు. ఆయా కాలనీల్లో చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు, పనికిరాని వస్తువులు, గ్రీన్ వేస్ట్‌ను తొలగించారు. యాంటీ లార్వా నివారణ చర్యలు చేపట్టారు.
రెండో రోజు ఇలా..