సిటీబ్యూరో, జూన్ 3(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పట్టణ ప్రగతి కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రులు, మేయర్‌తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ విస్తృత పర్యటనలు చేసి పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. నగరంలో పలుచోట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన జీవితం గడవగలమనే విషయాన్ని ప్రతి ఒకరు గుర్తించాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా పేరొన్నారు. ఖైరతాబాద్‌లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మొకలను నాటి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా పెద్ద గణేష్ విగ్రహ ప్రాంతం నుంచి అవగాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రచురించిన కరపత్రాలను ఆవిషరించారు.
పదిహేను దాకా పట్టణ ప్రగతి..
ఈ నెల 3 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శిథిలావస్థలో ఉన్న వార్డ్ ఆఫీస్ భవనాన్ని తొలగించి ఈ ప్రాంత ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి ఒకరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొనే విధంగా అవగాహన కల్పించడంతో పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి చెత్త కుప్పలను తొలగించడం జరుగుతుందని చెప్పారు.
అదే విధంగా దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎకడ నీరు నిలవకుండా చూడాలని, నాలాలు, డ్రైనేజీలలో నీరు సాఫీగా సాగేలా చర్యలు తీసుకునేలా చూస్తున్నామని తెలిపారు. ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్ ప్రజలు వర్షాకాలంలో ఎదురొంటున్న వరద సమస్య పరిషారానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రజలు ప్రధానంగా ఎదురొంటున్న సమస్యలను పరిషరించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి తలసాని అన్నారు.
ఇంటింటికీ.. చెత్త సేకరణ
ప్రజలు కూడా ఎకడ పడితే అకడ చెత్త, వ్యర్ధాలను వేయకుండా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలలో మాత్రమే వేయాలని చెప్పారు. ఇంటింటికి వాహనాలు వచ్చి చెత్తను సేకరిస్తున్నాయని, పారిశుధ్య నిర్వహణలో ప్రజలు సహకరించాలని కోరారు. మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాలలో హైదరాబాద్ నగరం ఒక ప్రత్యేక గుర్తింపును సాధించిందని చెప్పారు. ఇకడ సానుకూలమైన పరిస్థితులు ఉన్న కారణంగా విదేశీ సంస్థలు ఇకడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఈఈ ఇందిర, హార్టికల్చర్ డీడీ శ్రీనివాస్, ఏఎంఓహెచ్ భార్గవ్ పాల్గొన్నారు. అనంతరం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్‌లోని జవహర్ నగర్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక చిన్న మసీదు పకన ఉన్న రహదారి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్యారావు, జోనల్ కమిషనర్ శంకరయ్య తదితరులు ఉన్నారు.
వరద ముంపు సమస్యకు పరిష్కారం..
ఎన్నో ఏండ్ల నుంచి వరద ముంపు సమస్యను ఎదురొంటున్న నాలా పరిసర ప్రాంత ప్రజల సమస్యలకు శాశ్వత పరిషారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం క్రింద నాలాల పూడిక తొలగింపు, అవసరమైన ప్రాంతాలలో రిటైనింగ్ వాల్స్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఇప్పటికే పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు.