ఇలా కార్యాచరణ
బడిబాట కార్యక్రమ కార్యాచరణను జిల్లా విద్యాధికారి విజయకుమారి వెల్లడించారు. ఈనెల 3 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు పేర్ల నమోదు, 13న మనఊరు-మనబడి, మనబస్తీ-మనబడిపై వివరించడం, 14న ఇంగ్లీష్ మీడి యం బోధనను పరిచయం చేయడం, 15న తల్లిదండ్రులతో సమావేశం. 16న ఎస్ఎంసీ సమావేశాలు, 17న స్వయం సహాయక బృందాలతో సమావేశాలు, 18న బాలిక విద్యపై అవగాహన సదస్సు, 20న సామూహిక అక్షరాభ్యాసం. 21న స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాలు, 22న హరితహారం, 23న ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను బడిలో చేర్పించడం, 24న బాలసభలు, 25న పఠనోత్సవాలు, 27న బడిబయటి పిల్లలను బడిలో చేర్పించడం. 28న ద్విభాషా పుస్తకాల పరిచయం, 29న డిజిటల్ విద్యపై అవగాహన, 30న గణితం, సైన్స్ దినోత్సవాల నిర్వహణ.