సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రభుత్వం వివిధ స్థాయిలో పతకాలు ప్రకటించింది. అందులో భాగంగా రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డిని సీఎం సర్వోన్నత పతకం వరించింది. శుక్రవారం హోంమంత్రి మహమూద్ అలీ ఈ పతకాన్ని శ్రీధర్‌రెడ్డి అందజేశారు. ఈ అవార్డు కింద రూ.5లక్షల నగదు రివార్డును, మెడల్‌ను ఇన్స్పెక్టర్ అందుకున్నారు.