ఖైరతాబాద్/బంజారాహిల్స్/హిమాయత్‌నగర్, జూన్ 3 : ‘సీఎం కేసీఆర్..మంత్రి కేటీఆర్‌లకు ప్రత్యేక విజన్ ఉంది. నేడు రాష్ట్రం, నగరానికి విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయంటే….వారి కార్యదక్షతకు నిదర్శనం…అని’ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ పి. విజయారెడ్డితో కలిసి మొక్క లు నాటి ప్రారంభించారు. అలాగే బడా గణేశ్ నుంచి అవగాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిచేందుకు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. చెత్తను రోడ్లపై విచ్చలవిడిగా వేయకుండా ఉండేందుకు తడి, పొడి చెత్త డబ్బాలను ఇచ్చామని, ఎప్పటికప్పుడు వాటిని సేకరించేందుకు వాహనాలను సైతం కేటాయించామన్నారు.
మని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, ఈఈ ఇందిర, హార్టికల్చర్ డీడీ శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి, ఏఎంవోహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ, ఎంటమాలజీ సిబ్బంది భాస్కర్, సుమన్ పాల్గొన్నారు.
ప్రగతిపథంలో పట్టణాలు
హిమాయత్‌నగర్: బస్తీలు, కాలనీలను పరిశుభ్రంగా పెట్టుకుని, పచ్చదనం పెంచి, ప్రజా సమస్యల పరిష్కరించాలనే లక్ష్యంతో పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిం దని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా జనార్దన్బాడ, ఆదర్శబస్తీ, దత్తానగర్‌లో స్థానిక కార్పొరేటర్ జి.మహాలక్ష్మితో కలిసి ఆయన పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ నూతనంగా మంచినీటి పైపులైన్లు, సీవరేజ్,రోడ్ల నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని త్వరల్లోనే పనులు ప్రారంభమయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంబర్‌పేట సర్కిల్ డీసీ వేణుగోపాల్, నారాయణగూడ జలమండలి డీజీఎం సన్యాసిరావు,టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు యాదగిరిసుతారి, నాయకులు డి.రాజేందర్‌కుమార్,పి.ప్రభాకర్‌గౌడ్,కొల్కుల శ్రీకాంత్, సర్ఫరాజ్, యతిరాజ్, నందు,అశోక్, బీజేపీ నాయకులు జి.రామన్‌గౌడ్, జైస్వాల్, నర్సింగ్‌గౌడ్, పందిర్ల ప్రసాద్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోసమే పట్టణ ప్రగతి
-మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
బంజారాహిల్స్: బస్తీలు, కాలనీల్లో సమస్యల పరిష్కారంతో పాటు పరిశుభ్రథ వాతావరణాన్ని కల్పించడంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లో శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఎన్బీటీనగర్లో జీహెచ్ఎంసీతో పాటు వివిధశాఖల అధికారులతో కలిసి పర్యటించిన మేయర్ స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు అభివృద్ధ్ది ప్రణాళికలను రూపొందించి అమలు చేయడం కోసం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, చీఫ్ ఎంటమాలజిస్ట్ డా.రాంబాబు పాల్గొన్నారు.