ఉప్పల్జోన్ బృందం, జూన్ 3 : నివాసిత ప్రాంతాలను అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చేందుకు సీఎం కేసీఆర్ నిర్దేశించిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని శుక్రవారం అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివాసిత ప్రాంతాలు, కాలనీల్లో చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు, ఖాళీ ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండ తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కాలనీలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతిసాయిజెన్ శేఖర్, బన్నాల గీతాప్రవీణ్, స్వర్ణరాజ్, కక్కిరేణి చేతన, బండారు శ్రీవాణి, డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, ఉప్పల్ తాసీల్దార్ గౌతమ్‌కుమార్, ఈఈ నాగేందర్, అధికారులు, నేతలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
నాచారంలో కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, ఏఎంసీ సురేందర్, ఏఈ దయ, నేతలు సాయిజెన్ శేఖర్, ముత్యంరెడ్డి, రమణరెడ్డి, పాల్గొన్నారు.
కాప్రాలో జరిగిన కార్యక్రమంలో ఏఎంఓహెచ్ డాక్టర్ శ్రీనివాస్, ఏఈఈ అభిషేక్, శానిటరీ సూపర్వైజర్ నాగరాజు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సుడుగు మహేందర్ రెడ్డి, ఉప్పల్ టీఆర్ఎస్ మైనారిటీ అధ్యక్షుడు బద్రుద్దీన్, గిల్బర్ట్, పవన్, ఎన్.మహేశ్, కొండల్‌గౌడ్, కొప్పులకుమార్ పాల్గొన్నారు.
కుషాయిగూడ చాకలిబస్తీ, వీఎన్‌రెడ్డినగర్, విస్టా హోమ్స్, పెద్ద చర్లపల్లి తదితర ప్రాంతాల్లో నోడల్ అధికారాణి ఉష, వివిధ విభాగాల అధికారులతో కలిసి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటర్ వర్క్స్ యూజీడీ డీజీఎం సతీశ్, ఎలక్ట్రికల్ ఏఈ ప్రత్యూష, ఎస్పీడీసీఎల్ అధికారి మనోహర్, హర్టికల్చర్ అధికారి అజయ్, టీఆర్ఎస్ నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, బత్తుల శ్రీకాంత్‌యాదవ్, జయకృష్ణ, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
సర్వతోముఖాభివృద్ధి కోసమే..
మల్కాజిగిరి/ అల్వాల్/నేరేడ్మెట్/ గౌతంనగర్, జూన్ 3 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల అధికారులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. శుక్రవారం చేపట్టిన కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, మీనా ఉపేందర్‌రెడ్డి, సునీతారాము యాదవ్, శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, శ్రావణ్, డీసీలు రాజు, నాగమణి, ఈఈలు లక్ష్మణ్, రాజు, డీఈ మహేశ్, ఏఈలు శ్రీకాంత్, అరుణ్, జీఎం శ్రవంతి, మేనేజర్లు సతీశ్, మల్లికార్జున్, ఏఎంసీ హేమలత, ఏఈ లక్ష్మి, ఎంటమాలజీ ఏఈ అనిల్, నీటి సరఫరా అధికారి మల్లికార్జున్, అధికార ప్రతినిధి జీఎన్వీ సతీశ్ కుమార్, మీడియా ఇన్చార్జి గుండా నిరంజన్, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు పల్లె విజయకుమారి, అనిల్‌కిశోర్, జనార్దన్, మోసిన్, ప్రభాకర్, సత్యనారాయణ, సంపత్‌రావు, రాజేశ్ కన్న, పరశురాంరెడ్డి, కవిత, జ్యోతి, అర్వింద్, కవిత, బబిత, గాయత్రి, జ్యోతి, కిశోర్, వేదానంద్, మధుమతి, సిబ్బంది పాల్గొన్నారు.