దుండిగల్/కుత్బుల్లాపూర్/గాజులరామారం/జీడిమెట్ల, జూన్ 3 : సమస్యల పరిష్కారం కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి వెంకటేశ్వరనగర్, ఇంద్రసింగ్‌నగర్, వాణినగర్‌లలో శుక్రవారం జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వివేకానంద్ పాల్గొని మాజీ కార్పొరేటర్ కేఎం.గౌరీశ్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరనగర్‌లో కమ్యూనిటీ హాల్‌ను ఏర్పాటు చేయాలని, నాలా పూడికతీత పనులు, వరదనీరు సాఫీగా వెళ్లేలా డ్రెయిన్ల నిర్మాణం, సీసీ రోడ్డు, కలుషిత నీరు, ఓపెన్ ల్యాండ్‌లో వ్యర్థాల డంపింగ్ తదితర విషయాలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఉప కమిషనర్ మంగతాయారు, వాటర్‌వర్క్స్ మేనేజర్ డీజీఎం రాజేశ్, డీఈ ప్రశాంతి, నోడల్ అధికారి సురేందర్ నాయక్, జలమండలి మేనేజర్ శివప్రసాద్, ఎస్ఎస్ రాము, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగదీప్గౌడ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోమేశ్యాదవ్, సత్తిరెడ్డి, తదితరులు ఉన్నారు. అదే విధంగా జీడిమెట్ల డివిజన్ పరిధి గోదావరి హోమ్స్ వద్ద ఎమ్మెల్యే వివేకానంద్ మొక్కలు నాటారు. అనంతరం స్థానికంగా పారిశుధ్య పనులు, పార్కు అభివృద్ధి పనులను పరిశీలించారు. కాలనీ ప్రెసిడెంట్ మాధవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్దిరాములు, జ్ఞానేశ్వర్, తదితరులు ఉన్నారు.
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో…
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, 12వ డివిజన్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి ప్రారంభించారు. కమిషనర్ వంశీకృష్ణతో కలిసి మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి ఇందిరమ్మ కాలనీ ఫేజ్-2లో బస్తీ దవాఖాన భవనానికి, ఇందిరమ్మకాలనీ ఫేజ్-3లోని పోచమ్మ గుడి వద్ద క్రీడా ప్రాంగణానికి శంకుస్థాపన చేశారు. డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పద్మప్రసాద్, యూత్ ప్రెసిడెంట్ రాము, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి బట్ట మురళి, అనుబంధ కమిటీ సభ్యులు, నిజాంపేట్ కార్పొరేషన్ సీపీ శ్రీనివాస్, వాటర్ వర్క్స్ డీజీఎంలు సరిత, సాయిరామ్‌రెడ్డి, డీఈ పాల్గొన్నారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో…
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గాగిల్లాపూర్ 1వ వార్డులో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కౌన్సిలర్ కుంటి అరుణతో కలిసి ప్రారంభించారు. అనంతరం 28వ వార్డులో కౌన్సిలర్ జోసెఫిన్ సుధాకర్‌రెడ్డితో కలిసి బస్తీలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కమిషనర్ భోగీశ్వర్లు, హెచ్ఎండబ్లూఎస్ మేనేజర్ రాజ్‌కుమార్, కౌన్సిలర్ భరత్‌కుమార్, రైతు సమన్వయ శాఖ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, దుండిగల్ మున్సిపల్, టీఆర్ఎస్ పార్టీ కార్మికశాఖ అధ్యక్షుడు జగన్, నాయకులు మోర అశోక్, థామస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో…
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు నుంచి 18వ వార్డు వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్ ప్రారంభించారు. వైస్ చైర్మన్ రత్లావత్ గంగయ్యనాయక్, కమిషనర్ రఘు, డీఈఈ బి.చిరంజీవులు, ఏఈ ప్రవీణ్, పాల్గొన్నారు.
గాజులరామారం డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీ ఫేజ్ 1 , హెచ్ఏఎల్ కాలనీ, దేవేందర్నగర్లలో శుక్రవారం నిర్వహించిన నాల్గవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావు పాల్గొని స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీ ప్రశాంతి, నోడల్ అధికారి రూపాదేవి, ఏఈ కల్యాణ్, వర్క్ ఇన్స్పెక్టర్ రాజేందర్‌రెడ్డి, జలమండలి అధికారులు శివ, ఝాన్సీ, టీఆర్ఎస్ నాయకులు కమలాకర్, ఆంజనేయులు, శ్రీనివాస్ యాదవ్, నవాబు, సింగారం మల్లేశ్, సంధ్య, వీరయ్య, బాల్‌రెడ్డి, సతీశ్, మురళీ, నారాయణ, భాస్కర్, ప్రభాకర్, మధు, మురళీ, భరత్, నవీన్, విజయ్, శానిటేషన్, హర్టికల్చర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని భూదేవీహిల్స్, కూన మహాలక్ష్మీనగర్లలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ పాదయాత్ర నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి గుడెన్మెట్లో నోడల్ అధికారి డీఈఈ భానుచందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 20 ట్రిప్పుల వ్యర్థాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. దోమలు వృద్ధి చెందకుండ 62 ఇండ్లలో స్ప్రే చేశారు. నాలుగు రోడ్లను నూతనంగా సీసీ రోడ్లుగా మార్చాలని స్థానికులు కోరారు. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని నోడల్ అధికారి భానుచందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్వ శంకరయ్య, వివిధ శాఖల అధికారులు అబ్దుల్ రజాక్, కవిత, సత్యవతి, శివ, గణేశ్, కృష్ణ, శంకర్ నాయక్, పూజిత, తదితరులు పాల్గొన్నారు.
సుభాష్‌నగర్ డివిజన్ పరిధి భగత్‌సింగ్‌నగర్, అమీద్ బస్తీ, ముత్యాల బస్తీ, మొండి నర్సింహ బస్తీలలో మాజీ కార్పొరేటర్ జి.సురేష్‌రెడ్డి పర్యటించారు. నోడల్ అధికారి డీఈఈ పాపమ్మ స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు రాజు, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.
చింతల్ శ్రీసాయినగర్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కార్పొరేటర్ రశీదాబేగం ప్రారంభించారు. కార్యక్రమంలో గాజులరామారం డీసీ ప్రశాంతి, అధికారులు సంపత్, శ్రీనివాస్, పూజిత, పోతిరెడ్డి దుర్గారావు, శంకర్, తదితరులు పాల్గొన్నారు.