కొండాపూర్, జూన్ 3 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయం అభివృద్ధికి సోపానంగా ఉంటున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి 4వ విడతలో భాగంగా శుక్రవారం ఆయన శేరిలింగంపల్లి సర్కిల్ -20 పరిధిలోని కొండాపూర్ డివిజన్లో జోనల్ కమిషనర్ శంకరయ్య, కార్పొరేటర్ హమీద్ పటేల్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లె, పట్టణం అభివృద్ధిలో దూసుకుపోయేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ -20 డీసీ వెంకన్న, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ ఈఈ శ్రీనివాస్, డీఈ రమేశ్, డీఈ విశాలాక్షి, ఏఈ జగదీశ్, వర్క్ఇన్స్పెక్టర్ వెంకటేశ్, ఏఎంఓహెచ్ డాక్టర్ నగేశ్ నాయక్, జలమండలి మేనేజర్ సందీప్, ఎంటమాలజీ ఏఈ నగేశ్, శానిటేషన్ సూపర్వైజర్ జలందర్, ఎస్ఆర్పీ రాజయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చందానగర్‌లో..
పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పరిధి శంకర్‌నగర్, భవానీపురం, కేఎస్ఆర్ ఎంక్లేవ్, ఇక్రిసాట్ కాలనీ, తారానగర్ కాలనీల్లో పారిశుధ్య, అభివృద్ధి పనులను స్థానికులతో కలిసి కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్ష…
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని డివిజన్ పరిధిలోని గోపినగర్, నెహ్రూనగర్ బస్తీలలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యాక్షుడు యాదాగౌడ్, వార్డు మెంబర్ పర్వీన్ బేగం, గోపాల్ యాదవ్, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కాలనీల గతి మార్చేందుకు పట్టణ ప్రగతి
మియాపూర్, జూన్ 3 : కాలనీలు వీధుల గతిని మార్చుకునేందుకు పరిశుభ్రతను మరింతగా పెంపొందించుకునేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం దోహదపడుతుందని విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మియాపూర్ డివిజన్లో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, డీసీ నందగిరి సుధాంశ్లతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్లోని ఏఎస్‌రాజునగర్, డీకే ఎన్క్లేవ్లలో చేపట్టిన కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ నందగిరి శ్రీకాంత్, ఈఈ శ్రీకాంతిని, ఏఈ శివ, ప్రతాప్, విశ్వనాథ్, డాక్టర్ కార్తిక్, డీజీఎం నాగప్రియ, ఏఈ సాయిచరిత, ఏఈ రామ్మోహన్, గణేశ్, శ్రీనివాస్, కనకరాజు, మహేశ్, పార్టీ నేతలు కిరణ్ , గోపాల్, మహేందర్, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్, అశోక్, మురళి, అన్నిరాజు, చంద్రిక, రోజా, సుప్రజ, కోటయ్య, రాజు పాల్గొన్నారు.
మాదాపూర్ డివిజన్లో
మాదాపూర్: మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి జీహెచ్ఎంసీ ఈఈ శ్రీకాంతిని, ఏఈ ప్రశాంత్, జలమండలి మేనేజర్ మహేశ్వరీ, శానిటేషన్ ఎస్ఆర్పి ప్రసాద్‌లతో పాటు స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్ పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పట్టణ ప్రగతిని ప్రారంభించారు.
హఫీజ్‌పేట్‌లోని శాంతి నగర్ కాలనీలో ..
హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని శాంతి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ వి. పూజితగౌడ్ విచ్చేసి మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, స్థానిక జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నాగేశ్వరరావు, సంజీవ్‌రెడ్డి, బ్రిక్ శ్రీను, సాంబశివరావు, ఆది నర్సింహారెడ్డి, సాంబయ్య, వీరారెడ్డి, నాగభూషణం, శానిటేషన్, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.