-సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ)::“తెలంగాణ వీరపుత్రులు.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను ఎంతో మంది ధారపోశారు…ఆ వీరపుత్రుల సాక్షిగా చెబుతున్నా’.. అంటూ జలదృశ్యం నుంచి ఉద్యమ కాగడాను ఎత్తి రాష్ర్టాన్ని సాధించే దాకా పోరాటాన్ని నడిపారు ఉద్యమ నేత సీఎం కేసీఆర్. విశ్రమించకుండా పోరాడి స్వరాష్ర్టాన్ని సాధించారు. అదే స్ఫూర్తితో హైదరాబాద్‌కు పట్టిన జబ్బు వదలాంటే.. మామూలు వైద్యం సరిపోదని, శస్త్రచికిత్స చేయాల్సిందేనని ప్రతినబూని.. అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని తీర్చిదిద్దడంలో సఫలీకృతులయ్యారు. నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నగర రూపురేఖల్లో వచ్చిన మార్పులు, ఇక్కడ జరిగిన అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్
స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక బోనాల పండుగతో పాటు అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
మురికి కూపంగా మారిన హుస్సేన్‌సాగర్‌లో సుందరీకరణ
మూసీ నది రివర్ ఫ్రంట్ ఏర్పాటు.. సుందరీకరణతో పాటు కబ్జాకు గురికాకుండా చర్యలు.
కాలుష్యాన్ని తగ్గించేందుకు నగర పరిధిలోని అటవీ భూముల్లో ‘హరితహారం’
‘మన రాష్ట్రం.. మన పర్యాటకం’ పేరిట మరుగునపడిన ప్రదేశాలను వెలికితీసేందుకు ప్రత్యేక చర్యలు.
పట్టణ పేదల కోసం ఉచిత మంచినీటి పథకం.
నగరవాసులకు ఆహ్లాదం పంచేందుకు నగరం చుట్టూ పార్కుల అభివృద్ధి
పేదల సొంతింటి కలను సాకారం చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన రవాణా సౌకర్యం కోసం మల్టీలెవల్ ఫ్లై ఓవర్లు, ప్రత్యేక రవాణా కారిడార్ల ఏర్పాటు. మరికొన్నింటికీ ప్రణాళికలు.
విశ్వనగరం దిశగా దూసుకుపోతున్న హైదరాబాద్ స్టార్టప్‌లకు వేదికగా నిలిచింది. టీహబ్ వేదికగా వందలాది స్టార్టప్‌లు ప్రారంభం
రాష్ట్ర అభివృద్ధిని చూసి దేశ, విదేశీ సంస్థలు పెట్టుబడుల కోసం రాజధానికి వరుస కట్టాయి. ఫార్మా, రియల్ ఎస్టేట్‌కు ఎంతో ప్రాధాన్యత నెలకొంది. మరోవైపు పాతనగర అభివృద్ధికి ప్రణాళికల రూపకల్పన.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా 24 అంతస్తులతో పోలీస్ కమాండ్ కంట్రోల్ నిర్మాణం. 40 మల్టీలెవల్ పార్కింగ్‌ల కోసం ప్రణాళికల రూపకల్పన
నగరంలో ముంపునకు గురికాకుండా పలు ప్రాంతాల్లో నాలాల విస్తరణ
ల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంతో గ్రేటర్ పల్లెలతోపాటు నగరంలోని ప్రాంతాలను పరిశుభ్రతకు నిలయంగా మార్చేందుకు కృషి .
పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో బస్తీ దవాఖాలను ఏర్పాటు. – రజకుల బాధలు తీర్చేందుకు ధోబీఘాట్ల నిర్మాణం.
నాయీ బ్రాహ్మణులకు జీవనోపాధికి చేయూత.. వారి దుకాణాలకు ఉచిత కరెంటు
1872లో నిజాం కట్టించిన మోండా మార్కెట్‌ను ఆధునీకరణ
కొత్తరోడ్లు వందేండ్లు మన్నికగా ఉండే విధంగా రహదారుల నిర్మాణం.
పోరాడి స్వరాష్ర్టాన్ని సాధించడమే కాదు.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలిపారు సీఎం కేసీఆర్. పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చారు.