
చాంద్రాయణగుట్ట, జనవరి 28 : ప్రజలకు మంచి పాలన అందించడంలో తెలంగాణ సర్కార్ సక్సెస్ ఐనదని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. శుక్రవారం బండ్లగూడ తాసీల్దార్ షేక్ ఫర్హీన్ ఆధ్వర్యంలో హాఫిజ్ బాబానగర్ కోహినూర్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 545 మందికి షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పథకాలు అమలు చేస్తూ నేరుగా బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేయడం సంతోషదాయకం అన్నారు. డివిజన్ల కార్పొరేటర్లు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మండల సిబ్బంది, మజ్లిస్ కార్పొరేటర్లు సలీంబేగ్, ఆజం షరీప్, ఫహాద్ బిన్ అబ్దాద్, వాహిద్ పాల్గొన్నారు.
ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు చర్యలు
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటుచేయాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ వీధి దీపాల విభాగం అధికారులతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు బస్తీలు, కాలనీల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు.
శ్మశాన వాటికల అభివృద్ధికి కృషి
నాంపల్లి నియోజకవర్గం రెడ్‌హిల్స్ డివిజన్ బజార్‌ఘాట్ ఏ – బ్యాటరీ లైన్లో ఉన్న మసీద్- ఎ- జామియా శ్మశాన వాటికలో శుక్రవారం ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని శ్మశాన వాటికల్లో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి ఆరిఫ్ రిజ్వాన్, మసీద్ కమిటీ అధ్యక్షుడు ఖాజా నసీరుద్దీన్ ఖాద్రి, ఎంఐఎం నాయకులు అబ్దుల్ సుభాన్, ఖుద్దుస్, నయీం పాల్గొన్నారు.