కొండాపూర్, మే 30: వేగవంతమైన పరిశోధనలు, నూత న ఆవిష్కరణలతో స్వదేశీ వైద్య పద్ధతులను మరింత అభివృద్ధి పరిచేందుకు నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ), యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సం దర్భంగా ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఏఐజీలోని అత్యంత నిష్ణాతులైన వైద్య నిపుణులు, హైదరాబాద్ విశ్వ విద్యాలయంలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లోని ప్రముఖ పరిశోధకులతో కలిసి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. దీని వల్ల స్వదేశీ చికిత్సా విధానాలు, రోగ నిర్ధారణ సాధనాలు, రోగుల సంరక్షణ కోసం అవసరమైన నూతన ఆవిష్కరణలను మరింత ముందుకు సాగుతాయన్నారు. ఏఐజీ హాస్పిటల్, ఏషియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్‌లో తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన వైద్యం అందిస్తూ రోగుల సంరక్షణపై దృ ష్టి పెట్టనున్నామని వారు పేర్కొన్నారు.
హెచ్‌సీయూ వీసీ ప్రొ. బీజే రావు మాట్లాడుతూ ముఖ్యమైన ఆవిష్కరణలను వెలికితీసి, స్పష్టమైన ప్రయోజనాలతో పరిశోధనలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందులో భాగంగా పరిశోధకులు, వైద్యుల భాగస్వామ్యంలో స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఏఐజీ నుంచి ఉత్తమమైన ఆవిష్కరణలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యుల కోసం ప్రత్యేకంగా ఎండీ-పీహెచ్డీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ వం టి కొత్త కోర్సులను ఏఐజీతో కలిసి అభివృద్ధి చేస్తామని, తమ పరిశోధన నైపుణ్యాలను ఏఐజీకి విస్తరిస్తామన్నారు. అనంత రం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్‌లోని మైక్రోబ్స్ ఇన్ హెల్త్ అండ్ డిసీజెస్‌పై రెండు రోజుల సైంటిఫిక్ సెమినార్ కోసం ఏఐజీ వైద్యు లు, వర్సిటీలోని పరిశోధకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సె స్ డీన్ ప్రొ.దయానంద పాల్గొన్నారు.