సుల్తాన్‌బజార్, మే 29: నిజాం కాలేజీలో నిర్వహించిన మెగా ప్లేస్మెంట్ డ్రైవ్‌కు విశేష స్పందన లభించింది. సోమవారం నిజాం కళాశాల, లియోనీ కన్సల్టింగ్ సర్వీస్‌ల సంయుక్తాధ్వర్యంలో నిజాం కళాశాల సెంటినరీ హాల్లో నిర్వహించిన డ్రైవ్‌ను ప్రిన్సిపాల్ బి.భీమా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో నిలబడాలంటే సాంకేతిక నైపుణ్యం పెంచుకోవాలన్నారు. హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్ స్టీవెన్సన్, కో ఆర్డినేటర్ డాక్టర్ మురళీధర్‌రెడ్డిలు మాట్లాడుతూ నిజాం కళాశాలలో మెగా ప్లేస్మెంట్ డ్రైవ్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. మొదటిసారిగా నిర్వహించిన ఈ డ్రైవ్‌లో అబ్సిజ్, రిగాల్క్స్, డిలాయిట్-హెచ్ఎన్ సీ, టెక్ ఎం, రిలయన్స్ ఫార్మా, జస్ట్ డాల్ జీటీఎం, రిలయన్స్, జియో మార్ట్, హై నూన్, ఏజీఎస్ గ్రూప్, స్కై లాజిస్టిక్ మస్కతి, స్పెన్సర్స్, వీజీఎఫ్ఎస్, అట్ల్మెట్రిక్స్, గాలాక్సి తదితర సంస్థలతో పాటు మొత్తంగా 25 కంపెనీలు పాల్గొన్నాయి.
ఈ డ్రైవ్‌లో 500 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులను కళాశాల ప్రిన్సి పాల్ భీమా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ రంజని,లియోనైన్ కన్సల్టెంట్ సర్వీస్ డైరెక్టర్ ఖలీలుద్దీన్, కళాశాల ప్లేస్ మెంట్ ఆఫీసర్ స్రవంతి, కళాశాల పీఆర్వో డాక్టర్ కసప నరేందర్‌తో పాటు భోధన, భోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.