కీసర, మే 30: కీసరకు చెందిన అంజలి(20) నిండు గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు సోమవారం కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమె కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని ప్రసవం కాదని, మెరుగైన వైద్యం కోసం అంజలిని ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానకు తరలించాలని నిర్ణయించారు. 108 సిబ్బం ది ఈఏమ్టీ చిత్రం రవి, పైలెట్ రాజశేఖర్‌లు వెంటనే అంబులెన్స్‌లో తీసుకొని ఘట్కేసర్ ప్ర భుత్వ దవాఖానకు తరలించారు. మార్గమధ్యంలోని రాంపల్లి దాయర గ్రామ సమీపంలోకి రా గానే ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని 108 సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ డాక్టర్ శ్రీకాంత్‌కు ఫోన్ ద్వారా వివరించారు. ఈ పరిస్థితుల్లో డెలవరీ కోసం డాక్టర్ వారికి తగిన సలహాలు, సూచనలు అందించా రు. డాక్టర్ శ్రీకాంత్ ఇచ్చిన సలహాలు, సూచనలతో తల్లి కడుపులో బిడ్డ అడ్డం తిరిగి ప్రమాద స్థితిలో ఉన్నప్పటికీ సిబ్బంది సమయ స్ఫూర్తి తో వ్యవహరించి అంబులెన్స్‌లోనే ఆమెకు సాధారణ పద్ధతిలో పురుడు పోశారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఉపశమనం పొందా రు. తదుపరి వైద్య చికిత్సల కోసం తల్లీబిడ్డలను ఘట్కేసర్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇలాంటి పరిస్థితిలో సాధారణ పద్ధతిలో పురుడు పోసిన 108 సిబ్బందిని ఆసుపత్రి వైద్యులు అభినందించారు.