మేడ్చల్ రూరల్, మే 28 : మండల పరిధిలోని రాయిలాపూర్ గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని ఎంపీపీ రజితారెడ్డి, జడ్పీటీసీ శైలజా రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులకు ఆట స్థలాల ఏర్పాటుతో మేలు జరుగుతుందన్నారు. తమ క్రీడా ప్రతిభను పెంచుకునేందుకు విద్యార్థులు, యువత వినియోగించుకోవాలని కోరారు. ఎంపీడీవో రమాదేవి, వార్డు సభ్యులు రాధిక, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యురాలు మంజుల, పంచాయతీ కార్యదర్శి స్వరూప పాల్గొన్నారు.
గోధుమకుంట గ్రామంలో..
కీసర, మే 28 : ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఆట స్థలాలను ఏర్పాటు చేసి క్రీడాకారుల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల పరిధిలోని గోధుమకుంటలో ఆట స్థలానికి ఎంపిక చేసిన స్థలాన్ని శనివారం ఎంపీడీవో, ఎంపీవో మంగతాయారు, పంచాయతీ కార్యదర్శి సురేశ్‌రెడ్డి ట్రాక్టర్‌తో చదును చేయించారు. జూన్ 2న మంత్రి మల్లారెడ్డి ప్రారంభించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు.