మల్లాపూర్, మే 28: ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. శనివారం మల్లాపూర్ డివిజన్లోకార్పొరేటర్ దేవేందర్‌రెడ్డితో కలిసి కేఎల్రెడ్డినగర్లో 8 లక్షల 60 వేలతో కమ్యూనిటీ హాల్ రిపేరు పనులు, అశోక్‌నగర్‌లో 7 లక్షల 10 వేలతో డ్రైనేజీ పైపులైను పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.కార్యక్రమంలో కేఎల్రెడ్డినగర్ కాలనీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఈశ్వర్రావు, రమణయ్య, రాకేశ్, జయశ్రీ, ఆంజనేయులు, మాణిక్‌రెడ్డి, మల్లయ్య, అశోక్‌నగర్ కాలనీవాసులు లక్ష్మీనారాయణ, రఘు, నరేందర్‌రెడ్డి, అంజ య్య, అంజయ్య, ప్రవీణ్, శ్రీకాంత్, ప్రభు, మురళి, సైదు లు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాస్, వీరస్వామి, శ్రవణ్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్‌కు చెందిన చంద్రశేఖర్ అనారోగ్యానికి గురై సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. రూ.60వేలు మంజూరు కాగా ఆ చెక్కును ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి శనివారం కార్పొరేటర్ ప్రభుదాస్‌తో కలిసి లబ్ధిదారుడికి అందజేశారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప్రవీణ్ ముదిరాజ్, సంతోశ్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శివ, నవీణ్గౌడ్, గడియారం రామకృష్ణ, చంద్రశేఖర్, సాయికుమార్, మల్లగౌడ్ పాల్గొన్నారు.
మల్లాపూర్ డివిజన్ అశోక్‌నగర్‌కు చెందిన టీఆర్ఎస్ నేత నాగేందర్ గుండెకు స్టంట్ వేయించుకొని డిశ్చార్జి అయి ఇంటి వచ్చాడు. అతన్ని శనివారం ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్దేవేందర్రెడ్డి, సీనియర్ నాయకుడు లక్ష్మీనారాయణతో కలిసి పరామర్శించారు.
ఉప్పల్, మే 28: ఉప్పల్ డివిజన్ కురుమనగర్కు చెందిన కె.భాస్కర్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం సీఎం రిలీఫ్‌ఫండ్‌కు దరఖాస్తు చేశారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే నివాసంలోని కార్యాలయంలో సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి మంజూరు చేసిన రూ.51 వేల చెక్కును ఎమ్మెల్యే లబ్ధిదారుడికి అందజేశారు. కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, కురుమనగర్కాలనీ అధ్యక్షుడు మైసయ్య, నేతలు కృష్ణారెడ్డి, శివ, శంకర్ పాల్గొన్నారు.
నల్ల పోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
రామంతాపూర్, మే 28: రామంతాపూర్ నేతాజీనగర్‌లో ని నల్ల పోచమ్మ ఆలయ నాలుగో వార్షికోత్సవంలో శనివారం ఎమ్మెల్యే బేతిసుభాష్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూ జలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చాంద్‌పాష,శేఖర్‌యాదవ్, పాండు, ద యాకర్‌రెడ్డి,శ్రీకాంత్‌రెడ్డి,రవికాంత్‌రెడ్డి,నాయకులు ము స్తాక్,భాస్కర్‌రెడ్డి,కుమారస్వామి,కృష్ణారెడ్డి,శంకర్, పవన్, శివ పాల్గొన్నారు.