సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ)/ అబిడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రతి పేద వాడు ఉన్నత విద్యను అందిపుచ్చుకోవాలనే ధ్యేయంతో, ప్రభుత్వ బడులను కార్పొరేట్‌గా దీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 26వేల ప్రభుత్వ బడుల అభివృద్ధికి రూ.7,300 కోట్లు ఖర్చు చేస్తున్నారని, మొదటి విడుతలో 9,123 పాఠశాలల్లో రూ.3,500 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు.
ప్రతి ప్రభుత్వ బడిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద మోడల్ స్కూల్‌గా ఎంపిక చేసిన గన్‌పౌండ్రిలోని ప్రభుత్వ మహబూబియా, ఆలియా మోడల్ హైస్కూల్లను శుక్రవారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి సందర్శించారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం తరగతుల ప్రారంభం కోసం పాఠశాలలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులతో పాటు విద్యార్థులను ఆకర్షించే విధంగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. విడతల వారీగా అన్ని స్కూళ్లను అభివృద్ధి పరుస్తామని తెలిపారు.
70 శాతం పనులు పూర్తి
ఆలియా పాఠశాలలో 70శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభమవుతుందని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్న సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు, వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోని ఇంగ్లిష్ మీడియంలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్, డీఈవో రోహిణి, గన్‌ఫౌండ్రి కార్పొరేట్ సురేఖాఓంప్రకాశ్, గోషామహల్ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి ప్రేమ్ సింగ్ రాథోడ్, నాయకులు ఎం.ఆనంద్‌కుమార్ గౌడ్, ప్రియా గుప్త, శ్రీనివాస్‌గౌడ్, నందుకుమార్, అహ్మద్, సల్మాన్, శేఖర్, అజ్జు, ఖైసర్, నరేశ్ గౌడ్, బాలం, నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లో చేపట్టిన పనులు
మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా మేజర్, మైనార్ రిపేర్లకు సంబంధించి ప్యాచ్ వర్క్ పూర్తి చేశారు. 10 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన సంపును మోటర్తో సహా సిద్ధం చేశారు. బ్లాక్ బోర్డులు, ఎల్ఈడీ లైట్లు, స్కూల్ లోపల, బయట పెయింటింగ్, క్లాస్రూమ్, వరండాలో పిక్టోరల్ పెయింట్, ఫ్లోరింగ్ పూర్తిచేయడంతో పాటు అవసరమైన ఫర్నీచర్ కూడా ఏర్పాటు చేశారు.
నిధుల కేటాయింపు ఇలా..