ఉస్మానియా యూనివర్సిటీ, మే 27: ‘బండి సంజయ్ ఎంపీగా ఉండి.. ఏం ఒరగబెట్టినవ్’ అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. తెలంగాణలో మత కల్లోలాలను రెచ్చ గొట్టేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని బాలు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం గుర్తించిన భాషైన ఉర్దూను, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని మండిపడ్డారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అనేది దేశ ద్రోహమని, తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సూచించారు.
తెలంగాణకు రక్షక కవచంలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని, ఆయన పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇంకే రక్షణ కవచం అక్కర్లేదని ఎద్దేవ చేశారు. తాను ఎప్పటికీ కరీంనగర్ బిడ్డనేనని చెబుతున్న సం జయ్ పార్లమెంట్ సభ్యుడిగా ఏం ఒరగబెట్టాడో చెప్పాలని సవాల్ చేశా రు. విభజన హామీలను అమలు చేయకుండా, రాష్ర్టానికి న్యాయంగా రా వాల్సిన నిధులను సైతం విడుదల చేయకుండా కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నప్పటికీ సంజయ్ ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించా రు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన హితవు పలికారు. లేని పక్షంలో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.