మల్కాజిగిరి, మే 27: కుష్ఠు వ్యాధి అనుమానితులను గుర్తించి వారికి వ్యాధి గురించి అవగాహన కల్పించాలని డాక్టర్ సంతోషీలత అన్నారు. శుక్రవారం మచ్చ బొల్లారంలోని అర్భన్ హెల్త్ సెంటర్లో కుష్ఠు వ్యాధిని ఏలా గుర్తించాలో ఏఎన్ఎంలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోషీలత మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి వ్యక్తుల చర్మాన్ని పరిశీలించినప్పుడు చర్మపైన తెల్ల మచ్చలు, ఎరుపు మచ్చలు ఉన్నట్లు గుర్తించిన వెంటనే వాటికి స్పర్షను గుర్తించాలని అన్నారు. చిన్న పుల్లతో మచ్చపైన కొంచం నొక్కి స్పర్ష ఉందా ?.. అని ప్రశ్నించాలని అన్నారు. స్పర్షలేని వ్యక్తులకు ప్రాథమిక పరీక్షల తర్వాత పూర్తి స్థాయిలో వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మనమే తీసుకుని వెళ్లి పరీక్షలు చేయించాలని అన్నారు. కుష్ఠు వ్యాధి పట్ల ప్రజలలో ఉన్న అపోహలను తొలగించాలని అన్నారు. వ్యాధి ఉన్నవారు పూర్తి స్థాయిలో చికిత్సలు తీసుకుంటే వ్యాధి తగ్గిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమలో కేంద్ర పరిశీలక బృందం అరుణ, లింగనాయక్, శ్రీనివాస్‌రెడ్డి, లోకేందర్, సుదర్శన్, ఏఎన్ఎంలు అన్నపూర్ణ, మంజుల, సంపూర్ణ, బాలమణి తదితరులు పాల్గొన్నారు.