కాప్రా, మే 21: ఆపదకాలంలో సీఎం రిలీఫ్‌ఫండ్ వేలాదిమందికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే బేతిసుభాష్‌రెడ్డి అన్నారు. శనివారం కాప్రాడివిజన్ శ్రీరామ్నగర్కాలనీలో అనారోగ్యంతో బాధపడుతూ షేక్ నఫీసా, షేక్ మెహరున్నీసాలు సీఎం రిలీఫ్‌ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా వారికి రూ.లక్ష చొప్పున మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీ పత్రాలను, మల్లారెడ్డికి మంజూరైన రూ. 60వేల సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కును ఎమ్మెల్యే బేతిసుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ స్వర్ణరాజు, టీఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్న పేదవారికి సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా అందే ఆర్థిక సహాయం ఓ వరంగా మారిందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రామారావు, ఉప్పల్ టీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు బద్రుద్దీన్, కాప్రా, ఏఎస్‌రావునగర్ డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు మహేందర్‌రెడ్డి,మహిపాల్‌రెడ్డి,ఎన్.మహేశ్, కొండల్‌గౌడ్, కుమారస్వామి,కుమార్, పాండుగౌడ్, లక్ష్మీనారాయణ, భిక్షపతి, చందు, కాలనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు ఆహ్వానం
ఉప్పల్, మే 21: చిలుకానగర్గుట్టపైన శ్రీఆభయాంజనేయ స్వామి విగ్రహ శిఖర దివ్యప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వాన పత్రికను శనివారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి నిర్వాహకులు అందజేశారు.కార్యక్రమంలో ధర్మకర్త మధుసూదన్‌రెడ్డి, నేతలు వెంకటేశ్వర్‌రెడ్డి, రవికుమార్, నరేశ్, నర్సింగ్‌రావు, రాజు, రామకృష్ణ, సంతోష్‌రెడ్డి, నరేశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పరామర్శ
టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వనంపల్లి గోపాల్‌రెడ్డి తల్లి అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శనివారం దవాఖానకు చేరుకొని పరామర్శించారు.
పారిశ్రామికవాడల్లో సౌకర్యాలు కల్పిస్తాం..
చర్లపల్లి, మే 21: రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని నవోదయ పారిశ్రామికవాడ సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శని వారం కలిసి పారిశ్రామికవాడలోని సమస్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవాడలల్లో సమస్యలను పరిష్కరించడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను స్థాపించేలా సౌకార్యలు కల్పిస్తున్నారన్నారు. అదేవిధంగా నవోదయ పారిశ్రామికవాడలో ప్రధాన రహదారులతో పాటు డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామనారు. ముఖ్యం గా నవోదయ పారిశ్రామికవాడలో అనుమతుల ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నవోదయ పారిశ్రామికవాడ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్.నారాయణ, జే.ఆనంద్‌కుమార్, ఉపాధ్యక్షుడు సాయిరాం, కమిటీ సభ్యులు శేఖర్, తిరుపతిరావు, మోహన్‌రెడ్డి, వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులువెంకటేశ్వర్రెడ్డి, మహిపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ముత్యంరెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.