దుండిగల్,మే21: ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ మేడ్చల్‌జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. శనివారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేటలోని బ్లూమ్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులు స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్సీని కలిసి విన్నవించారు. వెంటనే స్పందించిన శంభీపూర్‌రాజు కమిషనర్ భోగీశ్వర్లుతో కలిసి బ్లూమ్స్ కాలనీలో పర్యటించారు. స్థానికంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకురాగా, వెంటనే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్సీ వెంట కౌన్సిలర్లు కృష్ణ,శ్రీనివాస్‌రెడ్డి,ఏఈ ప్రవీణ్,టీఆర్ఎస్ నాయకులు గోవిందరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, మురళీయాదవ్, దేవేందర్ ఉన్నారు.
గాజులరామారం సర్కిల్ పరిధిలోని పలు డివిజన్లకు చెందిన పార్టీ అధ్యక్షులు విజయ్రామిరెడ్డి, అశోక్, భాస్కర్,శ్రీకాంత్ శనివారం శంభీపూర్‌లోని కార్యాలయంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుతో సమావేశమయ్యా రు.ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఎమ్మెల్సీ వారికి దిశానిర్ధేశం చేశారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. స్థానికంగా ఏ సమస్య నెలకొన్నా తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ పూజలు
కుత్బుల్లాపూర్, మే 21: జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల గ్రామంలో ఉన్న నూతనంగా నిర్మించిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శనివారం ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కె.ఎం.ప్రతాప్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శేషగిరిరావు, సత్యనారాయణ, జగన్, బి.విజయ్‌శేఖర్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కె.పి.విశాల్‌గౌడ్, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.