మూసాపేట, మే20: వరదనీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వానకాలానికి ముందే పూడికతీత పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నాలాల్లో పేరుకుపోయిన వ్యార్థాలు, చెత్తకుప్పల తొలగింపు పనులను ముమ్మరంగా చేపడుతున్నారు. రూ.13.8లక్షల వ్యయంతో కూకట్పల్లి డివిజన్ పరిధిలోని దీనబంధుకాలనీ బ్రిడ్జి నుంచి రాజీవ్‌గాంధీనగర్, ప్రశాంత్‌నగర్, శ్రీశ్రీనగర్ 3.4 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన నాలాతో పాటు వరదనీటి పైప్లైన్లలో పూడిక తొలగింపు పనులు ప్రారంభించారు.
వరదనీరు సాఫీగా వెళ్లేలా చర్యలు
పూడిక తొలగింపుతో పాటు నాలా ప్రహరీల నిర్మాణం, రక్షణ వలయాలు ఏర్పాటు చేపడుతున్నారు. నాలాలు, వరదనీటి పైప్లైన్లు, ఓపెన్ నాలాల్లో పూడిక తొలగించి వరదనీరు సాఫీగా వేళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పైప్లైన్లు, చిన్నపాటి ఓపెన్ నాలాల్లో బకెట్ క్లీనింగ్ విధానం ద్వారా పూడిక తొలగిస్తున్నారు.
త్వరలో పనులు పూర్తిచేస్తాం
నాలాల పూడికతీత పనులు ఇప్పటికే 80శాతం పూర్తి చేశాం. ఈ నెల చివరి వరకు 100 శాతం పూర్తి చేసి వానకాలం మొదలయ్యేనాటికి వరదనీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. – శివప్రకాశ్, ఏఈ