శామీర్‌పేట, మే 19 : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే జీవో 714తో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని టీఆర్ఎస్కేవీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్ అన్నారు. జీవో 714ను నిరసిస్తు మేడ్చల్ జాతీయ రహదారిపై గురువారం ఆటో డ్రైవర్లుతో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలం తరువాత ఆటో డ్రైవర్లు ప్రశాంతంగా జీవనం సాగించే పరిస్థితులు లేవని చెప్పారు. ఇప్పుడు జీవో 714ను తీసుకువచ్చి ఆటో డ్రైవర్లను మరిన్ని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, మండల అధ్యక్షుడు పరమేశ్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్, ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షుడు ఎర్ర విజయ్‌రావు, టీఆర్ఎస్కేవీ పట్టణ అధ్యక్షుడు బాబురావుగౌడ్, కాళేశ్వర్, మహేశ్, సాయి, నవీన్, ప్రవీణ్, సుశాంత్, రాజు, నరేందర్, నర్సింలు, వినోద్, ప్రభాకర్‌గౌడ్, సుధాకర్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.