మెహిదీపట్నం మే 19 : అధికారులు అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్, అహ్మద్‌నగర్, విజయ్‌నగర్ కాలనీ, మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, మల్లేపల్లి డివిజన్లలో రూ.127 కోట్ల నిధులతో చేపట్టనున్న వివిధ రకాల అభివృద్ధి పనులకు గురువారం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్, నగర మాజీ మేయర్, మెహిదీపట్నం కార్పొరేటర్ మాజీద్ హుస్సేన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా రెడ్‌హిల్స్ డివిజన్లో పనులకు శంకుస్థాపన చేసిన ఆయన అహ్మద్‌నగర్, మెహిదీపట్నం, విజయ్‌నగర్ కాలనీ, ఆసిఫ్‌నగర్, మల్లేపల్లి డివిజన్లలో సుడిగాలి పర్యటన చేసి అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం కార్పొరేటర్ల ప్రతినిధులు ఆరిఫ్ రిజ్వాన్, డాక్టర్ షేక్ఖాసీం, ఎండీ.మూసా, జాఫర్ఖాన్లతోపాటు ఎంఐఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
నాంపల్లి అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్‌ను గురువారం మెహిదీపట్నం ఎమ్మెల్యే కార్యాలయం లో రెడ్‌హిల్స్ డివిజన్ ఎంఐఎం నాయకులు సన్మానించారు.