సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ ) : పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జూన్ 3 నుంచి 15రోజుల వరకు వార్డుల పరిధిలో నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమం ఏర్పాట్లను తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇంటింటికీ వెళ్లి అవగాహనతో పాటు ఫాగింగ్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్, తహశీల్దార్, శానిటేషన్ యూబీడీ, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.