ముషీరాబాద్, మే 18: అడిక్‌మెట్ డివిజన్లోని లలితానగర్‌లో డ్రైనేజీ సమస్యను నెల రోజుల్లో పరిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. రూ1.30 కోట్ల వ్యయంతో చేపడుతున్న పైపులైన్ నిర్మాణ పనుల్లో భాగంగా నాలుగవ ఫేస్ పనులను రెండు రోజుల్లో ప్రారంభించి లలితానగర్‌లో డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. బుధవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి లలితానగర్, వడ్డెరబస్తీల్లో పాదయాత్రలో భాగంగా డ్రైనేజీ సమస్యలు, పైపులైన్ నిర్మాణ పనులు చేపడుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా లలితానగర్ వాసులు పైపులైన్ పనులు రోడ్డు మధ్యలో నుంచి చేపట్టాలని, చివర నుంచి చేపడితే వృక్షాలు, మంచినీటి పైపులైన్లకు నష్టం కలిగే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు.
ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే స్థానికుల విజ్ఞప్తి మేరకు రోడ్డు మధ్యలో నుంచి పైపులైన్ నిర్మాణం చేపడుతామన్నారు. దశాబ్ధ్ద కాలంగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యను 80 శాతం మేర పరిష్కరించడం జరిగిందన్నారు. గత ఎన్నికలకు ముందే పైపులైన్ నిర్మాణాలకు నిధులు మంజూరైనా పనులు చేపట్టలేదని, తాను ప్రత్యేక చొరవ తీసుకొని పనులు చేయించినట్లు తెలిపారు. అదేవిధంగా వడ్డెరబస్తీలో డ్రైనేజీ సమస్యను త్వరలో పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం వాహబ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, బి.శ్రీనివాస్‌రెడ్డి, మాధవ్, శ్యామ్‌సుందర్, సురేందర్, ముచ్చకుర్తి ప్రభాకర్, అబ్బు, ఖలీల్, రాజు, లలితానగర్ కాలనీ ప్రతినిధులు రాజు, దేవానంద్, నవీన్, శ్యామ్, గాంధీ, సాంబయ్యలు పాల్గొన్నారు.
పైపులైన్ పనులు ప్రారంభం..
ముషీరాబాద్ డివిజన్ వెస్ట్ ఎంసీహెచ్ కాలనీలో రూ లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎం.సుప్రియా నవీన్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఎడ్ల హరిబాబు యాదవ్, ముఠా జయసింహ, కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, ఆకుల అరుణ్, శ్రీధర్‌రెడ్డి, అజయ్, సాంబశివరావు, లక్ష్మణ్ గౌడ్, బల్ల ప్రశాంత్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.