బండ్లగూడ, మే 18 : ప్రయాణికులకు ఉత్తమ సేవలందించడం హర్షణీయని ఆర్టీసీ రిజినల్ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపో లో ప్రయాణికులకు ఉత్తమ సేవలందించిన బర్కత్‌పుర డిపోకు చెందిన కండక్టర్ యాదయ్య, డ్రైవర్ హనుమంత్, రాజేంద్రనగర్ డిపోకు చెందిన కండక్టర్ నిర్మల, డ్రైవర్ ఆంజనేయులు, డ్రైవర్ అఖిల్ అహ్మ ద్, మెహిదీపట్నం డిపోకు చెందిన ఆర్. శ్రీనివాస్‌గౌడ్, రఘపతి తదితరులను సన్మానించడంతో పాటు వారికి నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి కార్మికుడు అంకిత భావంతో పని చేసి ఆర్టీసీ అభివృద్ధికి పాటు పడాలని అన్నారు. డి.వి.ఎం . రాములు, అనంత మోహన్, మహమ్మద్, ధర్మేందర్ పాల్గొన్నారు.