బొల్లారం,మే 13 :కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి శాస్త్రీనగర్లో అధ్వానంగా మారిన రోడ్లు..లాలామియా బస్తీల్లో మురుగుమయంగా మారిన డ్రైనేజీలు. వెరసీ ఈ సమస్యలను పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు బోర్డు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో పాడైన డ్రైనేజీలను గుర్తించి వార్డులోని పలు ప్రాంతాల్లో నూతన డ్రైనేజీలు,సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు.మరికొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి తవ్వకాల పనులు చేపడుతున్నారు. అందుకు రూ. 26 లక్షల నగదును కేటాయించి సీసీరోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేయించారు. గతంలో కొద్దిపాటి వర్షం కురిస్తే రోడ్లన్నీ బురదమయంగా మారేది. అయి తే ఆ సమస్యకు స్వస్తి పలికి ప్రతి బస్తీల్లో సీసీ రోడ్లు వేసి వాహనదారులు, పాదచారుల ఇబ్బందులను తొలగించారు. బోర్డు యంత్రాం గం వాహనాల రాకపోకలు సాఫీగా వెళ్లేలా నిర్మా ణం చేపట్టారు.శాస్త్రీనగర్ చౌరస్తా నుంచి హోలీ ఫ్యామిలీ స్కూల్ వరకు రూ.19 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు.లాలామియా బస్తీలో మజీద్ నుంచి బస్తీ చివరి వరకు రూ. 7 లక్షల వ్యయంతో నూతన పైపులైన్ పనులు చేపట్టారు. శాస్త్రీనగర్ బస్తీలో రోడ్ల నిర్మాణం పూర్తైన నేపథ్యంలో బస్తీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శాశ్వత సమస్యకు పరిష్కారం
లాలామియా బస్తీలో భూగర్భ డ్రైనేజీ సమస్యతో గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం.అధ్వానంగా మారిన రోడ్ల తవ్వకాలతో పైపులైన్ పగిలిపోయి మ్యాన్ హోళ్లు దెబ్బతిన్న కారణంగా మురుగు అంతా రోడ్లపై ప్రవహించేది.దీంతో బస్తీలు అపరిశుభ్రంగా ఉండేది. ఎమ్మెల్యే సాయన్న, స్థానిక నాయకుల చొరవతో బోర్డు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకొని మురుగు సమస్య లేకుండా నూతన పైపులైన్ పనులు చేపట్టారు. దీంతో శాశ్వత పరిష్కారం లభించింది.-శేఖర్,లాలామియా బస్తీ వాసి.