సుల్తాన్‌బజార్, మే 11 : ఎంతో క్లిష్టమైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తూ పేద ప్రజలకు ప్రభుత్వ దవాఖానలపై భరోసాను కల్పించడం అభినందనీయమని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ అన్నారు. బుధవారం టీఎన్జీవో ఉస్మానియా యూనిట్ అధ్యక్షుడు ఎంఏ రహీం, కార్యదర్శి పి.సుధాకర్, కోశాధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి, ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రి, ఏడీ నెహ్రూ నాయక్, డాక్టర్లు పాండు నాయక్, నాగప్రసాద్, రమేశ్, శ్రావణ్‌కుమార్, రాకేశ్ సహాయ్, ఆర్ఎంవోలు సాయిశోభ, నరేంద్ర కుమార్, రాజ్‌కుమార్, రఫీ, సుష్మ, అనురాధ, మాధవి, కవిత, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా నాయకులు కేఆర్ రాజ్‌కుమార్, ఉమర్ఖాన్, వైదిక్ శస్త్ర, శంకర్, శివ కుమార్, ఉస్మాన్, చందు, రవిగౌడ్, రమేశ్, కులకర్ణి, శారద, వేణు, నజీర్, తదితరులు పాల్గొన్నారు.