ఉప్పల్/ చర్లపల్లి, మే 10 : పారిశ్రామికవాడలో పనిచేసే కార్మికుల పిల్లల సంరక్షణకు కొవే సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్-1లో కొవే, మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవేక్ష కొవే డే కేర్ కేంద్రాన్ని టీఎస్ ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ ఈవీ. నర్సింహారెడ్డి, జోనల్ కమిషనర్ మాధవి, సీడ్బీ డీఎండీ వీఎస్ఎన్.రావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పారిశ్రామికవాడల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లల సంరక్షణకు ఉచిత డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లిన సమయంలో వారి పిల్లలకు ఈ కేంద్రం సంరక్షణగా ఉంటుందని తెలిపారు. పిల్లలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. శ్రామిక మహిళలకు మద్దతు ఇచ్చే విధంగా కొవే కృషి చేయడం అభినందనీయమన్నారు.
అనంతరం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, టీఎస్ ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ నర్సింహా రెడ్డి, సీడ్బీ డీఎండీ వీఎస్వీ.రావు, జోనల్ కమిషనర్ మాధవి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, చర్లపల్లి ఐలా చైర్మన్ కట్టంగూర్ హరీశ్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శివసాంబిరెడ్డి, మల్లిపెద్ది మధుసూదన్‌రెడ్డి, కొవే జాతీయ అధ్యక్షుడు మధుయాష్కి, కేబుల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోత్స్న, క్యూ డే కేక్ చైర్మన్ ఆర్తీ పటేల్, సీఐఏ ఫేజ్-1అధ్యక్షుడు మోహన్‌రావు, కార్యదర్శి వాసుదేవారెడ్డి, టీఐఎఫ్ కార్యదర్శి గోపాల్‌రావు, ఐలా కార్యదర్శి విశ్వేశ్వర్రావు, పారిశ్రామికవేత్తలు వెంకటేశ్వర్‌రెడ్డి, రోషిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఉప్పల్ పారిశ్రామిక వాడలో..
ఉప్పల్ పారిశ్రామిక వాడలోని ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ సెంటర్లో కొవే (మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య) ఆధ్వర్యంలో అవేక్ష డే కేర్ సెంటర్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, టీఎస్ ఐఐసీ ఎండీ డి.నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సెంటర్ పారిశ్రామికవాడలో పనిచేసే కార్మికుల పిల్లల సంరక్షణకు దోహదం చేస్తుందన్నారు. . పారిశ్రామిక వాడల్లో పనిచేసే కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శివసాంబిరెడ్డి, మల్లిపెద్ది మధుసూదన్‌రెడ్డి, వీఎస్వీ.శ్రీధర్‌రావు, నేతలు వెంకటేశ్వర్‌రెడ్డి, గడ్డం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.