కవాడిగూడ, జనవరి 16: సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని భోలక్‌పూర్ డివిజన్లోని బాకారం మల్లన్న దేవాలయంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు నల్లవెల్లి అంజిరెడ్డి, నల్లవెల్లి ఊర్మిలా అంజిరెడ్డి, ఆలయ ఈవో ఎం.రఘు ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి ప్రారంభమైన శ్రీ మల్లన్న జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా ముగిసాయి. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి మల్లన్నను దర్శించుకున్నారు. ఒగ్గు పూజారి బాబూరావు, ఆలయ పూజారి కె. మధుసూదనాచారి సమక్షంలో పూజలు నిర్వహించారు. భోలక్‌పూర్‌లోని ఇందిరానగర్‌లో ఈదమ్మ, పోచమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రావు, గాంధీనగర్ కార్పొరేటర్ పావని, మాజీ కార్పొరేటర్ కల్పన యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా జయసింహ హాజరై ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు ఎం. ఎల్లుబాయి, ఎం.యాదగిరి, జె.సత్యనారాయణ, ఈ.రవీందర్ గౌడ్, ఎ.రామానందరెడ్డి, ఎ.సురేందర్ రెడ్డి, పి.సూర్యప్రకాశ్ ముదిరాజ్, విజయ రావు, రాజ్ తదితరులు పాల్గొన్నారు.
మల్లన్నను దర్శించుకున్న కార్పొరేటర్ పావని
బాకారంలోని మల్లన్న స్వామి జాతరలో గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావనీ వినయ్‌కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పార్టీ నాయకులు వినయ్‌కుమార్, వడ్డెపల్లి ఆనంద్‌రావు, అరుణ్‌కుమార్, అభిషేక్, సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.