కీసర, మే 10 : పంచాయతీలో వాటర్ పైప్లైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరమ్మతు పనుల కోసం పంచాయతీ నుంచి నిధులను కేటాయించి పనులు చేయిస్తున్నామని చీర్యాల్ సర్పంచ్ తుంగ ధర్మేందర్ తెలిపారు. మండల పరిధిలోని చీర్యాల్లో మంగళవారం పైప్లైన్ మరమ్మతు పనులు, వాటర్ లీకేజీ పనులు సర్పంచ్ దగ్గరుండి సిబ్బంది చేత చేయించారు. పంచాయతీ సభ్యులందరూ తనకు సహకరిస్తే చీర్యాల్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు.