ఘట్కేసర్, మే 10 : పోచారం మున్సిపాలిటీ 1వ వార్డులోని ఇస్మాయిల్ఖాన్గూడం గ్రామంలో శ్రీరేణుక ఎల్లమ్మ జమదగ్నిల కల్యాణ మహోత్సవం మంగళవారం కన్నులపండువగా జరిగింది. గత మూడురోజులుగా ఆలయంలో జరుగుతున్న 33వ వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలు, ఇక్కడి పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన మహిళా భక్తులు, శివసత్తుల సమక్షంలో ఆలయ నిర్వాహకులు, అమ్మవారి ఉపాసకులు క్రిష్ణ ముదిరాజ్, ధర్మకర్త ఈగ మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో అగ్ని గుండాల ప్రవేశం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.
అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ఆలయం వద్ద నైవేద్యాన్ని తయారు చేసి బోనాలను సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. కల్యాణ మహోత్సవం, అగ్నిగుండాల ప్రవేశ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్ గొంగళ్ల మహేష్‌లను ఆలయ నిర్వాహకులు శాలువాలు కప్పి, తీర్థప్రసాదాలను అందజేసి సన్మానించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.