బడంగ్‌పేట, మే 9: కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నదని బీజేపీ ప్రభుత్వ తీరు తెన్నులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ ఫరిధిలోని దాసరి నారాయణ కాల నీ, కమలానగర్, బుడుగ జంగాల కాలనీ, ప్రగతి నగర్, లక్ష్మీనగర్ కాలనీకి చెందిన బీజేపీ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరా రు. మంత్రి వారికి గులాబీ కం డువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడం వలన బీజేపీని వీడుతున్నారని ఆమె అన్నారు. బీజేపీ ప్రభుత్వ నిత్యావసర ధరలతో పాటు వం ట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ద్వారా ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు. గ్యాస్ ధరలు తగ్గించే వరకు ప్రజలకు మద్దతుగా పోరాటం చేస్తామని మంత్రి అన్నారు. ధరల మీద ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని మండి పడ్డారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారు..
మహేశ్వరి గోపీ యాదవ్, యాదగిరి యాదవ్, నర్సింహ యాదవ్, రాజు యాదవ్ తోపా టు మరో 300 మంది టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు అర్కల భూపాల్ రెడ్డి, సిద్దాల బీరప్ప, టీఆర్ఎస్ అధ్యక్షుడు కామేశ్ రెడ్డి పాల్గొన్నారు.