ఖైరతాబాద్, మే 8: చిన్న పిల్లల్లో కంటి క్యాన్సర్ వస్తుందని, వ్యాధి అవగాహన పెంచుకోవాలని, అందుకు గాను తల్లిదండ్రు లు అప్రమత్తం కావాలని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లల్లో కంటి క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్ రోడ్ పీవీ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద ‘వైటథాన్’ పేరుతో అవేర్నెస్ రన్ నిర్వహించారు. 10కే, 5కే, 3కే విభాగాల్లో ఏర్పాటు చేసిన ఈ రన్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ ఎం.రాజేష్ చంద్ర, ఎల్వీపీఈఐ వ్య వస్థాపకులు డా.జీఎన్ రావు, ఐ సైట్ యూనివర్సల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఐ క్యాన్సర్ విభాగాధిపతి, అక్యూలర్ ఆంకాలజిస్ట్ డా.స్వాతి కలికి, వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. డీసీపీ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ పిల్లల్లో వచ్చే కంటి క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన ఉండాలని ఈ రన్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డా.జీఎన్ రావు మాట్లాడుతూ ఈ క్యాన్సర్ పిల్లల్లో ఎక్కు వగా వస్తుందని, దానిని గుర్తించి చికిత్స అందిస్తే చూపును రక్షించవచ్చన్నారు. మూడేళ్ల కంటే చిన్న పిల్లల్లో వైట్ రిఫ్లెక్ట్స్ కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని డా.స్వాతి అన్నారు.