బేగంపేట్ మే 8: సనత్‌నగర్ నియోజకవర్గంలోని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో మంజూరైన చెక్కులను ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో లబ్ధిదారులకు అందించారు. 113 మంది లబ్ధిదారులు చెక్కులను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ… ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి, లక్ష్మీ హేమలత, మాజీ కార్పొరేటర్లు తరుణి, అరుణగౌడ్ శేషుకుమారి , ఆకుల రూప, తహసిల్దార్లు విష్ణుసాగర్, బాలశంకర్ పాల్గొన్నారు.
జిమ్‌లను వినియోగించుకోవాలి
ప్రజా అవసరాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఆదివారం రాంగోపాల్‌పేట్ డివిజన్లో కుర్మబస్తీలో రూ.8.50 లక్షలతో ఏర్పాటు చేసిన జిమ్‌ను, అలాగే ఓల్డ్ గాస్మండిలో రూ. 50లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను కార్పొరేటర్ చీర సుచిత్రతో కలిసి ప్రారంభించారు. అలాగే మంత్రి తన సొంత నిధులతో చేపడుతున్న ఓల్డ్ గాస్మండిలో ఉప్పలమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ జిమ్‌ను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బస్తీ ప్రజల అవసరాల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను శుభాకార్యాలకు ఉపయోగించుకోవచ్చునని సూచించారు. కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో మొక్కలను నాటేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న ట్యాంక్‌కు మరో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని జలమండలి జీఎం రమణారెడ్డిని ఆదేశించారు. నియోజకవర్గం ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధికి పాటు పడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, బేగంపేట్ డీసీ ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.