ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మన్సూరాబాద్/హయత్‌నగర్/వనస్థలిపురం, జనవరి 3: నిరక్షరాస్యులైన మహిళలకు విద్యాబుద్దులు నేర్పి వారిలో చైతన్యం కల్పించిన మొట్ట మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే ఆశయాలకు అనుగుణంగా పయనించాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి చిత్రసీమకాలనీలో సావిత్రిబాయి ఫూలే ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం 191వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, కర్మన్‌ఘాట్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై సావిత్రిబాయి ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు, పోచబోయిన జగదీశ్‌యాదవ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
చిత్రసీమకాలనీలో టీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, బీఎన్‌రెడ్డి మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న వేర్వేరుగా హాజరై సావిత్రిబాయి ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవాల కమిటీ కన్వీనర్ శనిగారపు స్వామి, కో కన్వీనర్ మేడిగ శ్రీధర్, మోకిళ్ల వెంకట్‌రెడ్డి, గుగులోత్ బాలునాయక్, రంజిత్ గౌడ్, భాస్కర్ గుప్తా, అశోక్‌గౌడ్, కృష్ణ గౌడ్, శ్రీనాథ్‌రెడ్డి, వెంకటేశ్‌నేత, సుమన్‌గౌడ్, పంతు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
హయత్‌నగర్‌లో.. హయత్‌నగర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన హయత్‌నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేశ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచానికి ఆదర్శం సావిత్రిబాయి హస్తినాపురం సుభాష్ చంద్రబోస్ కాలనీలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మంద జయన్న మాదిగ, శ్రీనివాస్, లక్ష్మన్న, వెంకటేశ్, తిమ్మప్ప, ఈశ్వర్, ఆనంద్, విజయ్, తదితరులు జడ్పీహెచ్ఎస్ హయత్‌నగర్‌లో.. జడ్పీహెచ్ఎస్ హయత్‌నగర్‌లో ప్రధానోపాధ్యాయుడు తొండ వెంకటేశ్, హయత్‌నగర్ మండల డిప్యూటీ తాసీల్దార్ ఎన్.కిష్టయ్య సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వేరోస్ ఇంటర్నేషనల్ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో డ్రాయింగ్, వ్యాస రచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్వేరోస్ ఇంటర్నేషనల్ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ప్రతినిధులు శంకర్, శ్రీకాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.