మన్సూరాబాద్/ఎల్బి నగర్, మే 7: బాక్స్‌టైప్ నాలా పనులను వేగవంతంగా పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూ చించారు. నాగోల్ డివిజన్ పరిధి దేవకీ కన్వెన్షన్ హాల్ సమీపంలో జరుగుతున్న బాక్స్‌టైప్ నాలా పనులు, మాల్ మైసమ్మ దగ్గర జరుగుతున్న ఫ్లై ఓవర్ పనులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెష ల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌తో కలిసి ఎ మ్మెల్యే సుధీర్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ఎ మ్మెల్యే మాట్లాడుతూ బాక్స్‌టైప్ నాలా పనులు, ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సిటీ చీఫ్ ప్లానర్ దేవేందర్ రెడ్డి, జెడ్సీ పంకజ, డీసీలు సురేందర్ రెడ్డి, మారుతి దివాకర్, జోన ల్ సిటీ ప్లానర్ ప్రసాద్ రావు, ఎస్ఈ అశోక్‌రెడ్డి, ఎస్ఈ ప్రాజెక్ట్స్ రవీందర్ రాజు, ఈఈ ప్రాజెక్ట్స్ రోహిణి, ఈఈ కోటేశ్వర రావు, నాయకులు అనంతుల రాజిరెడ్డి, తూర్పాటి చిరంజీవి, గుం టి లక్ష్మణ్ పాల్గొన్నారు.