ఒడిషా నుంచి నగరానికి జోరుగా గంజాయి
ఒడిషా కేంద్రంగా నగరంలో జరుగుతున్న గంజాయి విక్రయాలపై హైదరాబాద్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అ ధికారులు దాడులు జరిపారు. గంజా యి విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.16 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిషాకు చెందిన గులాం రసూల్(32) స్వస్థలం నుంచి గంజాయి తీసుకొచ్చి నగరంలోని చాప ల్ రోడ్డులో టీ, కాఫీ, స్నాక్స్ వ్యాపారులైన మహమూద్ ఖాన్ (48), చాంద్ బాయి (45), బిస్మిల్లా ఖాన్ (46), ఎస్కే.ముజాహిద్ (32), తాజుద్దీన్ ఖా న్ (45)లకు సరఫరా చేస్తాడు.
- రూ.16 లక్షల విలువైన గంజాయి పట్టివేత
- ఆరుగురు నిందితుల అరెస్ట్
సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): ఒడిషా కేంద్రంగా నగరంలో జరుగుతున్న గంజాయి విక్రయాలపై హైదరాబాద్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అ ధికారులు దాడులు జరిపారు. గంజా యి విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.16 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిషాకు చెందిన గులాం రసూల్(32) స్వస్థలం నుంచి గంజాయి తీసుకొచ్చి నగరంలోని చాప ల్ రోడ్డులో టీ, కాఫీ, స్నాక్స్ వ్యాపారులైన మహమూద్ ఖాన్ (48), చాంద్ బాయి (45), బిస్మిల్లా ఖాన్ (46), ఎస్కే.ముజాహిద్ (32), తాజుద్దీన్ ఖా న్ (45)లకు సరఫరా చేస్తాడు. ఈ ఐదుగురు వ్యాపారులు గంజాయిని నగరంలో తమకు పరిచయమున్న వారికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ సమాచారం అందుకున్న హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నిందితులపై నిఘాపెట్టారు. కాగా శనివారం గులాం రసూల్ ఒడిషా నుంచి నగరానికి కారులో గంజాయి రవాణా చేసి, చాపల్రోడ్లోని మహమూద్‌ఖాన్, చా ంద్బాయ్, బిస్మిల్లాఖాన్, ఎస్కె.ముజాహిద్, తాజుద్దీన్ఖాన్లకు అప్పగిస్తుండగా అప్పటికే కాపు కాసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నిందితులపై దాడి చేసి, పట్టుకున్నారు. ఈ దాడిలో ఒడిషాకు చెందిన గంజాయి సప్లయర్ గులాంతోపాటు మొత్తం ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.16లక్షల విలువ చేసే 16.230 కిలోల గంజాయి, రూ. 14,500 నగదుతోపాటు కారును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును నారాయణగూడ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

