దోమలగూడలోని మీ సేవా ఎదుట గల జీహెచ్ఎంసీ పార్కులో మౌలిక వసతుల కల్పన కోసం రూ.57 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేసి పై అధికారులకు పంపాం.నిధులు మంజూరు కాగానే పార్కు లో పార్కులో బల్లలు, ఇంటర్‌లాకింగ్ టైల్స్, పాత్‌వేలు, బోర్, చిల్డ్రన్స్ ప్లే, చైన్‌లింక్ మెష్‌లు, కాంపౌండ్ వాల్, వ్యాయామశాల, గేట్, పచ్చదనం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.
-తిరుపతి, ఏఈ, కవాడిగూడ,(జీహెచ్ఎంసీ)
కవాడిగూడ, ఆగస్టు 8: సందర్శకులకు ఆహ్లాదాన్నిచ్చే పార్కులో పచ్చదనం కరువైంది. కవాడిగూడ డివిజన్ లోని దోమలగూడ మీ సేవా ఎదుట గల జీహెచ్ఎంసీ పార్కు దాదాపు 400 గజాల్లో ఉంది. కొన్నేండ్ల నుంచి పార్కులో మౌలిక వసతులు లేకపోవ డంతో సందర్శకుల తాకిడి లేక వెలవెలబోతుంది. పార్కు లో పచ్చదనం, కూర్చోవడానికి బల్లలు, ఇంటర్‌లాకింగ్ టైల్స్, పాత్‌వేలు, బోర్, గ్రీనరీ, చిల్డ్రన్స్ ప్లే, చైన్‌లింక్ మెష్ లేకపోవడంతో పార్కు ఎడారిగా కనిసిస్తుంది.
పార్కులో ఎక్కడబడితే అక్కడ మట్టి,రాళ్ల కుప్పలు దర్శనమిస్తున్నాయి. గేట్, కాంపౌండ్ గ్రిల్స్ తుప్పుపట్టి శిథిలావస్థకు చేరుకుంది.చీకటి పడిందంటే ఆకతాయిలు పార్కులో మద్యం తాగుతున్నారని స్థానికులు ఆరోపిస్తు న్నారు. పార్కులో మౌలిక వసతులు కల్పించి స్థానికులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికా రులను కోరుతున్నారు.