సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు వివిధ రాష్ర్టాల్లో గాలించి..పలువురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వీరిలో బ్యాంకు ఖాతాదారులు, బ్యాంకు ఖాతాలు అందించే కమీషన్ ఏజెంట్లు, మరికొందరు నేరుగా నేరానికి పాల్పడుతున్న వారు కూడా ఉన్నారు.
ప్రధానంగా రాజస్థాన్ నుంచి ఎక్కువగా నేరగాళ్లను పట్టుకున్నట్లు తెలిసింది. ఆరు బృందాలుగా విడిపోయిన సైబర్‌క్రైమ్ పోలీసులు.. ఒక్కొక్కరూ ఒక్కో రాష్ర్టానికి వెళ్లారు. ఈ బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో 20 మంది సైబర్నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని సైబర్‌క్రైమ్ పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.