Hyderabad | హైదరాబాద్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. దొంగలు, నేరస్తుల నుంచి ప్రజలను కాపాడాల్సిన ఓ పోలీసు అధికారి తుపాకీనే మిస్సయ్యింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఓ ఎస్సై.. రికవరీ చేసిన బంగారంతో పాటు తన సర్వీస్ రివాల్వర్‌ను తాకట్టు పెట్టినట్లుగా తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం కేసులో రికవరీ చేసిన బంగారంతో పాటు ఎస్సై భాను ప్రకాశ్ తుపాకీ మిస్సయినట్లుగా తాజాగా తోటి సిబ్బంది గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులు ప్రాథమికంగా విచారణ జరపగా ఎస్సై ఎలాంటి సమాధానం చెప్పలేదు. అయితే రికవరీ చేసిన బంగారంతో పాటు తుపాకీని కూడా ఓ పాన్ బ్రోకర్ షాపులో ఎస్సై అమ్మినట్లుగా అనుమానాలు వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతోనే తన గన్ను ఎస్సై తాకట్టు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎస్సై భానుప్రకాశ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే గన్ మిస్సింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.