ఎల్బీనగర్, జూన్ 9: పట్టణ ప్రగతి కార్యక్రమంతో కాలనీలు, బస్తీలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త అన్నారు. గురువారం పట్టణ ప్రగతిలో భాగంగా కొత్తపేట డివిజన్లోని మోహన్‌నగర్ కమర్శియల్ టాక్స్ కాలనీ, చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలో కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దయానంద్ గుప్త మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో కొత్తపేట కార్పొరేటర్ పవన్‌కుమార్, చైతన్యపురి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహేశ్‌యాదవ్, శరత్చంద్ర, కమర్శియల్ టాక్స్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అంజయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్, బీజేపీ నాయకులు సుందర్, తిరుమల్, సత్యనారాయణ, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్, జవాన్ లక్ష్మయ్య, ఎస్ఎఫ్ఏలు చిరంజీవి, రాజిరెడ్డి పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ హయత్‌నగర్ సర్కిల్ ఆధ్వర్యంలో గురువారం మన్సూరాబాద్ డివిజన్ పరిధి హిమపురికాలనీ, వివేకానందనగర్, కమలానగర్, జడ్జెస్కాలనీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా కాలనీల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ పర్యవేక్షించారు. పలు కాలనీల్లో రోడ్లకు ఇరువైపుల వేసిన పురాతన భవనాల వ్యర్థ శిథిలాలను తొలగింపజేశారు.సహారాస్టేట్స్కాలనీకి వెళ్లే మార్గంలోని కమలానగర్లో రోడ్లపై పేరుకుపోయిన చెత్తచెదారాన్ని జేసీబీతో తొలగింపజేశారు. ఈ సందర్భంగా డీసీ మారుతీదివాకర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్, సిబ్బంది పాల్గొన్నారు.