మేడ్చల్ జోన్ బృందం, జూన్ 9 : నియోజకవర్గంలోని 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతున్నది. గురువారం పాలకవర్గ సభ్యులు, అధికారులు పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, అధికారులతో కలిసి జ్ఞానాపూర్లో పర్యటించారు. రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. తాగునీటి కొరత అధిగమించడానికి నూతన సంప్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
కమిషనర్ రాములు, కౌన్సిలర్లు ఆంథోనమ్మ ఫిలిప్స్, రాజకుమారి సుధాకర్ పాల్గొన్నారు. మేడ్చల్ చైర్పర్సన్ దీపికానర్సింహా రెడ్డి 8, 9వ వార్డుల్లో పర్యటించారు. నాగారం మున్సిపాలిటీ 7వ వార్డులో చైర్మన్ చందారెడ్డి, కౌన్సిలర్ సబితాఆంజనేయులు, కమిషనర్ వాణిరెడ్డితో కలిసి పర్యటించారు. దమ్మాయిగూడ 7వ వార్డులో రూ.4 లక్షలతో చేపట్టిన యూజీడీ నిర్మాణ పనులను చైర్పర్సన్ ప్రణీతాశ్రీకాంత్ గౌడ్ ప్రారంభించారు. వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కమిషనర్ స్వామి, కౌన్సిలర్ పావనీ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని 3, 4, 7, 1వ వార్డుల్లో చెత్తా చెదారం తొలగించడంతో పాటు రోడ్డు ప్రక్కన పడవేసిన మట్టిని, ఖాళీస్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు.
చైర్మన్ రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. పోచారం మున్సిపాలిటీ 11వ వార్డులో చైర్మన్ బి.కొండల్‌రెడ్డి పర్యటించారు. పారిశుధ్య పనుల నిర్వహణను పరిశీలించారు. కమిషనర్ సురేశ్, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కౌన్సిలర్లు రాజశేఖర్, సాయిరెడ్డి పాల్గొన్నారు. పీర్జాదిగూడ పరిధిలోని 13వ డివిజన్లో కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మీ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వార్డు కమిటీ సమావేశంలో మేయర్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
కమిషనర్ రామకృష్ణారావు, డీఈ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్లో ఉన్న ఎస్బీఆర్ కాలనీలో మేయర్ సామల బుచ్చిరెడ్డి పర్యటించారు. 2వ డివిజన్లో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, 3వ డివిజన్లో కార్పొరేటర్ చందర్‌గౌడ్ పర్యటించి, సమస్యలు తెలుసుకున్నారు. జవహర్‌నగర్ పరిధిలోని 12వ డివిజన్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కమిషనర్ జ్యోతిరెడ్డి, కార్పొరేటర్ సతీశ్‌కుమార్ పర్యటించారు.