శేరిలింగంపల్లి, జూన్ 3: నడుస్తున్న కారు లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే కారు ఆపి పక్కకు జరగగానే మంటలు పెద్దగా వ్యాపించి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కారు పూర్తిగా దగ్ధమైంది. సోమవారం రాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకున్నది. టయోటా కామ్రిన్ హైబ్రీడ్ కారు బయోడైవర్సిటీ వైపు నుంచి గచ్చిబౌలికి వెళుతున్నది.
సోమవారం రాత్రి సైబరాబాద్ కమిషనరేట్ సమీపంలోకి రాగానే ఇంజిన్ నుంచి పొగ రావడంతో ఆపి ఇద్దరు వ్యక్తులు కిందకు దిగారు. నిమిషాల వ్యవధిలోనే కారు పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారని రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు.